“కృష్ణ వ్రింద విహారి” టీజర్‌కి ముహూర్తం ఫిక్స్..!

Published on Mar 26, 2022 6:17 pm IST

యంగ్ హీరో నాగశౌర్య, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనీష్‌ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం “కృష్ణ వ్రింద విహారి”. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్‌ని ఇచ్చారు మేకర్స్. మార్చి 28న టీజర్‌ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో షిర్లే సెటియా హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్‌ నటి రాధిక, వెన్నెల కిశోర్, రాహుల్‌ రామకృష్ణ, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహతి స్వరసాగర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :