కృష్ణార్జున యుద్ధం టిజర్ విడుదల అయ్యేది అప్పుడే !
Published on Mar 8, 2018 11:12 am IST

నాని రెండు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులకు కనువిందు చేయనున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను షైని స్క్రీన్ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ఇప్పటికే కృష్ణ, అర్జున్ పాత్రలను పరిచయం చేయడమే కాకుండా రెండు పాటలను విడుదల చేసారు.

ఈ రెండు పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. మార్చి 10 న టీజర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇకపోతే నాని జూన్ నుండి నాగార్జునతో చెయ్యబోయే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. శ్రీ రామ్ ఆదిత్య ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు.

 
Like us on Facebook