20 ఏళ్ల తర్వాత ఇళయరాజాతో.. కృష్ణవంశీ భేష్

Published on Nov 14, 2019 12:00 am IST

ఏదైనా సినిమాకి ఇళయరాజా సంగీతం ఇస్తున్నారంటే ఆ సినిమాపై తెలియకుండానే ఒక విధమైన రెస్పెక్ట్, అంచనాలు మొదలవుతాయి. ప్రస్తుతం కృష్ణవంశీ కొత్త ప్రాజెక్ట్ ‘రంగమార్తాండ’ పరిస్థితి ఇదే. ఈ సినిమా కోసం కృష్ణవంశీ ఇళయరాజాను సంప్రదించండం, సంగీతం అందివ్వడానికి ఆయన ఒప్పుకోవడం జరిగిపోయాయి. దీంతో కృష్ణవంశీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

గతంలో కృష్ణవంశీ, ఇళయరాజా కలిసి 1998లో వచ్చిన ‘అంత:పురం’ సినిమాకి పనిచేశారు. ఆ సినిమాలోని సంగీతం, పాటలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో తెలిసిందే. అలాంటి వీరు మళ్లీ 20 ఏళ్ల తర్వాత కలిసి పనిచేయనున్నారు. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. సినిమా స్థాయి కూడా పెరిగింది.

త్వరలో సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రాన్ని మధు కలిపు, అభిషేక్ జవ్కర్ కలిసి నిర్మిస్తున్నారు. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కు ఇది రీమేక్. ఇందులో రమ్యకృష్ణ, ప్రకాష రాజ్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు.

సంబంధిత సమాచారం :