క్రేజీ బ్యూటీకి వాళ్ళు అసలు నచ్చరట !

Published on May 23, 2021 2:01 am IST

క్రేజీ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో ఉప్పెన సినిమా‌తో ఎంట్రీ ఇచ్చి ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. దాంతో ఫామ్ లో ఉన్న యంగ్ హీరోల స‌ర‌స‌న వ‌ర‌స‌గా అవ‌కాశాలు వస్తున్నాయి. మొత్తానికి టాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీయెస్ట్‌ హీరోయిన్‌ గా మారిపోయిన ఈ బ్యూటీకి అసలు ఒక్క విషయం నచ్చదట. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అబద్దం చెప్పేవారంటే తనకు అసహ్యమని చెప్పుకొచ్చింది.

అబద్దం చెప్పే అబ్బాయిలైన, అమ్మాయిలైన వాళ్లకు దూరంగా ఉంటానని తెలిపింది. ఇక సినీ వర్గాల సమాచారం ప్రకారం కృతిశెట్టి ప్రస్తుతం ఒక సినిమాకి ఏకంగా కోటి రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ అడుగుతుంద‌ట‌. తన నటనతో ఆమె మెప్పించే నటి కాబట్టి ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. కాగా కృతీ ప్రస్తుతం నాని హీరోగా వస్తోన్న ‘శ్యామ్ సింగ‌రాయ్’ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. దీనితో పాటు సుధీర్‌బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రామ్‌ పోతినేనితో మరో సినిమాలో కృతీ హీరోయిన్‌గా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

సంబంధిత సమాచారం :