జీ తెలుగు సరికొత్త షో “ముత్యమంత ముద్దు” ను ప్రమోట్ చేస్తున్న కృతి శెట్టి!

Published on Jul 25, 2021 9:09 pm IST


బుల్లితెర ప్రేక్షకులను నిరంతరం అలరిస్తున్న జీ తెలుగు సరికొత్త షో తో సిద్దం అయింది. ముత్యమంత ముద్దు అంటూ సరికొత్త ధారావాహిక ను ప్రారంభం చేస్తోంది. అయితే ఈ షో ను ఉప్పెన ఫేం కృతి శెట్టి ప్రమోట్ చేస్తుంది. తాజాగా విడుదల అయిన ఈ ధారావాహిక ప్రోమో లో కృతి శెట్టి కనిపిస్తూ సరికొత్తగా ప్రమోట్ చేయడం జరిగింది.

అయితే ఒక అమ్మాయి పెళ్ళి అయితే జీవితం మారిపోతుంది అని, ఇంటిను వదులు కోవాలి, ఇంటి పేరు మార్చుకోవాలి, అమ్మా నాన్న ను దాదాపు మర్చిపోవాలి అంటూ కృతి శెట్టి ఈ కాన్సెప్ట్ ప్రోమో లో చెప్పుకొస్తుంది. అయితే అలా కూతురు ఇంట్లో నుండి అత్త వారింటికి వెళ్లిపోతే అమ్మా నాన్న అనాధ లే కదా అంటూ మొదలు కానుంది. అయితే ఈ కాన్సెప్ట్ ప్రోమో ప్రస్తుతం నెటిజన్ల ను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం :