బేబమ్మ రెమ్యునరేషన్ పెంచేస్తుందా?

Published on Jul 21, 2021 12:43 am IST

ఉప్పెన సినిమాతో బేబమ్మగా తెలుగువారికి పరిచయమైన కన్నడ బ్యూటీ ‘కృతిశెట్టి’ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి తన ఇమేజ్‌ను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. అయితే న్యాచురల్ స్టార్ నాని ‘శ్యామ్‌ సింగరాయ, ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేని సినిమాలో, సుధీర్‌బాబు ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లోనే కాకుండా అక్కినేని నాగార్జున ‘బంగార్రాజు’లో కూడా ఛాన్స్ కొట్టేసింది.

అయితే ‘బంగార్రాజు’ చిత్రంలో నాగ‌చైత‌న్య కీల‌క పాత్రలో నటిస్తున్నాడు. అతడికి జోడీగా కృతిశెట్టి న‌టించ‌బోతుంద‌ని ప్రచారం జరుగుతుంది. ఇవన్ని పక్కన పెడితే బంగార్రాజు సినిమాలో నటించేందుకు కృతిశెట్టి తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. ఇప్పటి వరకు రూ.50 ల‌క్ష‌లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్న కృతి బంగార్రాజు సినిమా కోసం రూ.75 ల‌క్ష‌లు తీసుకుంటుంద‌ట‌. వరుస ఆఫర్లు వస్తుండడంతో కృతి తన రెమ్యునరేషన్‌ను పెంచేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే బంగార్రాజు షూటింగ్ సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :