“ఆదిపురుష్” పై ఆసక్తికర విషయాలు చెప్పిన కృతి.!

Published on Jul 16, 2021 9:07 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు ప్రతిష్టాత్మక చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో ప్లాన్ చేసిన భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటని తెలిసిందే. భారతీయ ఇతిహాసానికి చెందిన అత్యంత కీలక ఘట్టం రామాయణం ఆధారంగా అత్యంత ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మరి ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

మరి ఈ సినిమాపైనే కృతి లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించినట్టు తెలుస్తుంది. మొదట్లో ఈ సినిమాపై సెంటిమెంట్స్ పరంగా అనేక వివాదాలు తలెత్తాయి అని ట్రోల్స్ కూడా వచ్చాయి కానీ వాటికి అతీతంగా ఎక్కడా కూడా రామాయణం హద్దులు దాటకుండా ఈ చిత్రం తెరకెక్కుతుంది అని తెలిపింది.

అలాగే అలంటి సబ్జెక్టును ఇంత అద్భుతంగ హ్యాండిల్ చేసిన దర్శకుడు చేతిలో వర్క్ చెయ్యడం నిజంగా అదృష్టం అని కూడా ఆమె తెలిపింది. తన రోల్ చాలా బాధ్యతతో కూడుకుని ఉన్నది అని అందుకే మరింత శ్రద్ధతో తన పాత్రను చేస్తున్నాని కృతి సనన్ తెలిపింది. ఇక ఈ భారీ చిత్రంలో సైఫ్, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా వచ్చే ఏడాది ఆగస్టులో ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :