
గత సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కృతి సనన్. ఈ సినిమాలో తన నటనకి, లుక్స్ కి మంచి మార్కులే పడ్డాయి. అదే సంవత్సరం కృతి సనన్ హిందీలో కూడా ‘హీరోపంతి’ సినిమాతో బాలీవుడ్ లో పరిచయం అయ్యింది. ఈ సినిమాకి గాను కృతి సనన్ తన మొదటి ఫిలింఫేర్ అవార్డు ని అందుకుందిబ్రిటానియా సమర్పించిన 60వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుక నిన్న అరిగింది. ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో హీరోపంతి సినిమాకి గాను బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా అవార్డు గెలుచుకుంది.
ప్రస్తుతం ఈ భామ తెలుగులో నాగ చైతన్య హీరోగా, సుదీర్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా కూడా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా కాకుండా కృతి సనన్ బాలీవుడ్ హీరోస్ అయిన అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ లతో సినిమాలు చేస్తోంది. తన మొదటి హిందీ సినిమాకి అవార్డు రావడంతో కృతి సనన్ చాలా హ్యాపీగా ఉంది.

