ఆగస్ట్ 6న థియేటర్ల లో విడుదల కానున్న “క్షీరసాగర మథనం”

Published on Jul 20, 2021 3:30 pm IST

సాప్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ పంగులూరి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం క్షీరసాగర మథనం. ఈ చిత్రం ను పలు సాప్ట్ వేర్ కంపెనీల్లో పని చేస్తున్న యువకులు రూపొందించారు. అయితే ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని వచ్చే నెల ఆగస్ట్ 6 వ తేదీన థియేటర్ల లో విడుదల కాబోతుంది. మానవ సంబంధాల నేపథ్యం లో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్న ఈ చిత్రం లో మానస్ నాగులపల్లి, బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ లు హీరోలు గా నటించారు.

అయితే ఈ చిత్రం లో హీరోయిన్ గా అక్షత సోనావని నటిస్తుండగా, ప్రతినాయక పాత్రలో ప్రదీప్ రుద్ర నటిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు అనిల్ మాట్లాడుతూ, శేఖర్ కమ్ముల, దేవ కట్టా, మధుర శ్రీధర్ రెడ్డి వంటి సాప్ట్ వేర్ టర్న్డ్ డైరెక్టర్స్ ను స్ఫూర్తిగా తీసుకుని సాప్ట్ వేర్ రంగం లో ఉన్న కొందరు లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ క్షీర సాగర మథనం రూపొందించాం అని అన్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 6 న థియేటర్ల లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత సమాచారం :