‘కుబేర’ : నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్ పై మేకర్స్ ఎగ్జైటింగ్ అప్ డేట్

‘కుబేర’ : నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్ పై మేకర్స్ ఎగ్జైటింగ్ అప్ డేట్

Published on May 1, 2024 12:30 AM IST

వెర్సటైల్ యాక్టర్ ధనుష్, కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కుబేర. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. ఈ పాన్ ఇండియన్ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ధనుష్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించిన విషయం తెలిసిందే. ఇక నాగార్జున ఫస్ట్ లుక్ ని మే 2న రివీల్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.

కాగా మ్యాటర్ ఏమిటంటే, నాగ్ ఫస్ట్ లుక్ ని ఐపిఎల్ లో భాగంగా మే 2న సాయంత్రం జరుగనున్న హైదరాబాద్ vs రాజస్థాన్ మ్యాచ్ లో సాయంత్రం 6 గం. లకు ప్రత్యేకంగా రివీల్ చేయనున్నారు. అనంతరం అధికారికంగా విడుదల కానుంది. మొత్తంగా నాగ్ లుక్ పై అందరిలో మంచి ఇంట్రెస్టింగ్ ఏర్పరిచింది టీమ్. కాగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా కుబేర మూవీ ఉంటుందని, తప్పకుండా రిలీజ్ అనంతరం భారీ విజయం అందుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు