డిఫరెంట్ పాత్రలను సృష్టించి, వాటికి ఓ చిత్రమైన స్క్రీన్‌ప్లే ని జోడించి సినిమాలు తీసి తెలుగులో టాప్ డైరెక్టర్‌లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా వినూత్న సినిమాలను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. అనుకోవడమే తడవుగా సుకుమార్ తన సొంత బ్యానర్‌పై ‘కుమారి 21F’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుకుమార్ స్వయంగా కథ – స్క్రీన్‌ప్లే అందించి, పల్నాటి సూర్య ప్రతాప్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన ఈ సినిమాలో వరుసగా రెండు హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ హీరోగా, హీబా పటేల్ హీరోయిన్‌గా కనిపించనున్నారు.
ఇటీవలే ఎన్.టి.ఆర్ చేస్తుల మీదుగా రిలీజ్ అయిన ఫస్ట్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని వినూత్నంగా ప్రమోట్ చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సిద్దమయ్యారు. ఇప్పుడు బాగా ఫేమస్ అయిన డబ్ మాష్ చాలెంజ్ ని కుమారి 21F కోసం వాడుతున్నారు. ఈ రోజు రాత్రి వైజాగ్ లో కుమారి 21F డబ్ మాష్ చాలెంజ్ ని లాంచ్ చేయనున్నారు. మీరు ఫాలో అవ్వాల్సింది 3 స్టెప్స్..
స్టెప్ 1 : మీ ఫోన్ లో డబ్ మాష్ ఆప్ ని ఓపెన్ చెయ్యడం
స్టెప్ 2 : కుమారి 21F ఆడియోకి మీ వీడియో ని మాచ్ చేసింది
స్టెప్ 3: ఆ వీడియో లింక్ ని Kumari21FContest@gmail.com మెయిల్ ఐడికి సెంద్ చేయండి లేదా www.facebook.com/Kumari21F లో అప్లోడ్ చేయండి.
ఈ కాంటెస్ట్ లో గెలిచిన వారికి అక్టోబర్ 301న జరగనున్న ఆడియో లాంచ్ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఉంటాయి, అలాగే ఒక లక్కీ విన్నర్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కలిసే అవకాశం కూడా ఉంటుంది..


