కొండారెడ్డి బురుజులో మహేశ్ బాబు !

Published on Aug 25, 2019 12:44 pm IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా మహేశ్ బాబు కోసం కొండారెడ్డి బురుజు సెట్ ను వేశారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొండారెడ్డి బురుజుని క్రియేట్ చేసింది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఈ సెట్ లోనే జరుగుతుందట.

కాగా ఈ షెడ్యూల్ లో మహేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ అలాగే కొంతమంది ముఖ్య తారాగణం కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజుతో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :