కమల్ హాసన్ సరసన లేడీ సూపర్ స్టార్ !

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘విశ్వరూపం-2’ ముగింపు పనుల్లో ఉన్నారు. నిన్ననే మొదలుపెట్టిన ఆయన ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. దీని తర్వాత ఆయన స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు-2’ ను ప్రారంభించనున్నారు. వీరి కాంబినషన్లో గతంలో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందనుంది.

ఈ చిత్రాన్ని నిర్మించనున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ కమల్ కు జోడీగా కొందరు హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తోందట. ఆ జాబితాలో లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు మొదట్లో ఉందని, దర్శకనిర్మాతలు ఆమెనే ఫైనల్ చేసే యోచనలో ఉన్నారని వినికిడి. 2018 మధ్యలో మొదలుకానున్న ఈ చిత్రం ‘భారతీయుడు’ మొదటి భాగం ముగిసిన హాంగ్ కాంగ్ లోనే మొదలుకానుంది.