లక్ష్య ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్…సరికొత్త లుక్ లో నాగ శౌర్య!

లక్ష్య ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్…సరికొత్త లుక్ లో నాగ శౌర్య!

Published on Nov 28, 2021 2:49 PM IST

నాగ శౌర్య హీరోగా ధీరేంద్ర సంతోష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం లక్ష్య. ఈ చిత్రం ను సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు మరియు శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో నాగ శౌర్య సరసన హీరోయిన్ గా కేతిక శర్మ నటిస్తుండగా, జగపతి బాబు, సచిన్ ఖేదేఖర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం ను వచ్చే నెల డిసెంబర్ 10 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియో లు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసేందుకు సిద్దమైంది. డిసెంబర్ 1 వ తేదీన చిత్ర ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించడం జరిగింది. సరికొత్త పోస్టర్ లో నాగ శౌర్య డిఫెరెంట్ మేకోవర్ లో కనిపిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో నాగ శౌర్య లుక్స్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు