నాగశౌర్య లక్ష్య చిత్రం పై ప్రతి శుక్రవారం అప్డేట్!

Published on Jul 23, 2021 6:00 pm IST

ధీరేంద్ర సంతోష జాగర్లమూడి దర్శకత్వం లో నాగ శౌర్య, కేతిక శర్మ లు హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం లక్ష్య. ఈ చిత్రం లో జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం పురాతన విలువిద్య ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వినోదాత్మకంగా, ఉత్సాహం గా ఉంటుంది అని చిత్ర యూనిట్ హామీ ఇచ్చింది.

అయితే ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యే దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. అయితే చిత్ర యూనిట్ ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను ప్రతి శుక్రవారం నాడు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. #lakshyasfriday హ్యాశ్ ట్యాగ్ ద్వారా ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ను ప్రతి శుక్రవారం ఇవ్వనుంది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని సోనాలి నారాంగ్ సమర్పణ లో నారాయణ దాస్ కే నారంగ్, పుస్కురు రామ్మోహన్ రావు, శరత్ మరార్ లు నిర్మిస్తున్నారు. కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :