కొంచెం ఆందోళనకరంగానే లతా మంగేష్కర్ ఆరోగ్యం

Published on Nov 12, 2019 10:39 am IST

లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ లతా మంగేష్కర్ అనారోగ్యం రీత్యా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో ఆమెను అసుపత్రిలో జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు. ఆమె ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది.

నిన్న మొత్తం వెంటిలేటర్ మీదనే చికిత్స అందించిన వైద్యులు ఈరోజే ఆమెను ఐసీయూకు మార్చారు. ఆమె ఆరోగ్యం కొంచెం క్రిటికల్ కండీషన్లోనే ఉందని, కానీ కొన్ని గంటలుగా మెరుగుపడుతోందని ఆసుపత్రి వర్గాలు చెబుతుండగా కుటుంబ సభ్యులు కూడా లతా త్వరగానే కోలుకుంటున్నారని అంటున్నారు. ఇక్క దేశవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుకు లతా త్వరగా కోలుకొని మళ్లీ తన గాత్రంతో అద్భుతమైన పాటలు పాడాలని కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

More