కొన్ని నెలల కితం మళయాళ సినిమా దగ్గర వచ్చి సెన్సేషనల్ హిట్ గా నిలిచిన చిత్రం “2018”. మరి నిజ జీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు జూడే ఆంథోని తెరకెక్కించిన ఈ చిత్రం అందరినీ ఎంతగానో కదిలించింది. టాలెంటెడ్ హీరో తోవినో థామస్ హీరోగా మరింతమంది ముఖ్య నటులు నటించిన ఈ చిత్రం మళయాళంలో అయితే అప్పటి వరకు ఉన్న అన్ని సినిమాల రికార్డులు క్రాస్ చేసి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఇండస్ట్రీ హిట్ అయ్యింది.
అంతే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రం లేటెస్ట్ గా అరుదైన ఘనత అందుకుంది. మరి ప్రపంచ ప్రఖ్యాత అవార్డు ఆస్కార్స్ 2024 అవార్డ్స్ కి గాను ఇండియా ఫిల్మ్ ఫెడరేషన్ వారు ఎంపిక చేసిన మొదటి చిత్రంగా ఇప్పుడు ఇది నిలిచింది. దీనితో ఈ గుడ్ న్యూస్ ఇండియా వైడ్ గా మారింది.
