చలనచిత్ర సమస్యల సమావేశం ముగిసింది !

చలనచిత్ర సమస్యల సమావేశం ముగిసింది !

Published on Feb 20, 2022 10:32 PM IST

చలనచిత్ర ప్రముఖులు 24 క్రాఫ్ట్‌ ప్రతినిధులతో చలనచిత్ర సమస్యలు, కార్మికుల సంక్షేమం పై తాజాగా ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. కాగా కరోనా సంక్షోభం తర్వాత సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు థియేటర్లకు ప్రేక్షకులు తగ్గిపోవడం, సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోవడం థియేటర్లుకు పెరిగిన విద్యుత్‌ చార్జీల భారం, క్యూబ్‌ డిజిటల్‌ ఛార్జీల చెల్లింపులు ఇలా అనేక విషయాల పై సుదీర్ణంగా చర్చించారు.

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆధ్వర్యంలో ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ లో జరిగిన ఈ సమావేశంలో దర్శకులు రాజమౌళి, కొరటాల శివతో పాటు నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, నట్టి కుమార్‌, ప్రసన్న కుమార్‌, సి కల్యాణ్‌, మురళీమోహన్‌ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అలాగే ఓటీటీ ష్లాట్‌ ఫాంలో సినిమాలు విడుదల కావడం పై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు