లేటెస్ట్..”ఆదిపురుష్” కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యిందట కానీ.!

Published on Jul 3, 2021 9:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ ప్రాజెక్ట్స్ లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా, కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇది వరకే ముంబై లో కొంత మేర జరిగింది.

కానీ అక్కడ కరోనా తీవ్రత ఒక్కసారిగా ఎక్కువ కావడంతో అంతా హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు. కానీ ఇక్కడ కూడా లాక్ డౌన్ పెట్టడంతో మళ్ళీ ఈ సినిమా షూట్ వాయిదా పడింది. ఫైనల్ గా మళ్ళీ ముంబైలో పరిస్థితులు సర్దుమణిగాక ఎట్టకేలకు షూట్ ను స్టార్ట్ చేస్తున్నట్టుగా స్వయంగా దర్శకుడు ఓంరౌత్ నే క్లారిటీ ఇచ్చారు.

కానీ ఈ షూట్ అంతా ప్రభాస్ లేకుండానే జరుగుతుందట. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ బ్యాలన్స్ షూట్ సహా “సలార్” షూట్స్ లో పాల్గొననున్నాడు. వాటి తర్వాత “ఆదిపురుష్” లో జాయిన్ కానున్నాడు. ఇక ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రలో నటిస్తుండగా సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది ఆగష్టు 11న భారీ ఎత్తున రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :