లేటెస్ట్..”కేజీయఫ్ 2″ మరో బిగ్ సర్ప్రైజ్ రాబోతోందా.?

Published on Jul 28, 2021 9:00 am IST


కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “కేజీయఫ్ చాప్టర్ 2″దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మరి ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి మేకర్స్ సమయానుగుణంగా సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంపై మరో ఆసక్తికర టాక్ వినిపిస్తుంది.

రేపు జూలై 29 సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మరో అదిరే సర్ప్రైజ్ గిఫ్ట్ రానుంది అని లేటెస్ట్ బజ్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో అధీరా అనే పవర్ ఫుల్ రోల్ లో సంజు నటిస్తున్న సంగతి తెలిసిందే. లాస్ట్ టైం పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే ప్రతి ఒక్కరిలోనూ హైప్ ఇంకో లెవెల్లోకి వెళ్ళింది. మరి మేకర్స్ ఈసారి ఎలాంటి ట్రీట్ ని అందివ్వనున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :