లేటెస్ట్.. “హరిహర వీరమల్లు” పై అవైటెడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

లేటెస్ట్.. “హరిహర వీరమల్లు” పై అవైటెడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

Published on Apr 17, 2024 10:01 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawankalyan) హీరోగా నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” (Hari Hara Veeramallu Teaser) కోసం అందరికీ తెలిసిందే. ఒక టైం లో పవన్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రంగా నిలిచింది. కానీ తర్వాత పలు కారణాలు చేత వాయిదా పడుతూ వస్తుంది. అయితే గత కొన్నాళ్ల కితమే మేకర్స్ సినిమా నుంచి టీజర్ ని వదులుతున్నట్టుగా కూడా అప్డేట్ అందించారు.

కానీ అది ఇంతకీ రాలేదు. ఇప్పుడు ఫైనల్ గా దీనిపై సాలిడ్ అప్డేట్ ని మేకర్స్ అందించారు. ఈ రామ నవమి కానుకగా అయితే ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో టీజర్ ని అతి త్వరలోనే వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక దీనిపై డేట్ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రంలో బాబీ డియోల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై పవన్ కెరీర్ లో ఈ చిత్రం నిలిచిపోయేలా నిర్మాత ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు