‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ ఇలానే ఉంటుందా ?

Published on May 22, 2019 4:00 am IST

రాజమౌళి తాను డైరెక్ట్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు టైటిల్ పెట్టే బాధ్యతను ప్రేక్షకులకే అప్పగించారు. దీంతో ఔత్సాహికులు చాలామంది తమకు తోచిన పేర్లను సజెస్ట్ చేశారు. ఎక్కువమంది మాత్రం ‘రామ రావణ రాజ్యం, రఘుపతి రాఘవ రాజారామ్’ అనే రెండు పేర్లనే చెప్పడం జరిగింది.

కథ కూడా ఈ ఫ్రెండు పేర్లకు దగ్గరగా ఉండటం వలన ఆ రెండు పేర్ల నుండే ఒక కొత్త టైటిల్ తయారు చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. మరి చూడాలి రెండు పేర్లలో ఉన్న 6 పదాల్లో ఏ మూడింటిని కలిపి జక్కన్న టైటిల్ రూపొందిస్తారో. దానయ్య నిర్మిస్తున్న ఈ హెవీ బడ్జెట్ చిత్రంలో తారక్ కొమురం భీమ్ పాత్ర చేస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఇందులో ఒక కథానాయకిగా అలియా భట్ ఫైనల్ కాగా ఇంకో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు దర్శక నిర్మాతలు.

సంబంధిత సమాచారం :

More