వెంకి, వరుణ్ పక్కన హీరోయిన్లు వారేనా ?

26th, March 2018 - 12:59:20 PM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ నటిస్తోన్న సినిమా ‘ఎఫ్2’. తాజా సమాచారం మేరకు మెహరిన్ ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన కథానాయకిగా నటించబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ గోపీచంద్ ‘పంతం’, విజయ్ దేవరకొండ ‘నోటా’ వంటి సినిమాల్లో నటిస్తోంది. కామెడి ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా నటించే అవకాశాలున్నాయట.

దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా జూన్ నుండి ప్రారంభం కానుంది. వెంకటేష్ తేజ దర్శకత్వంలో నటించబోయే సినిమా పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ కాబోతున్నాడు. వరుణ్ తేజ్ ఈ మూవీతో పాటు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా, సాగర్ చంద్ర దర్శకత్వంలో మరో సినిమా చెయ్యబోతున్నాడు.