శంకర్, చరణ్ ల ప్రాజెక్ట్ స్టార్టింగ్ పై లేటెస్ట్ బజ్.!

Published on Jul 28, 2021 11:00 am IST


ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి తో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం మరో టాప్ ఇండియన్ దర్శకుడు శంకర్ తో సినిమా అనౌన్స్ చేసి మరో మారు పాన్ ఇండియన్ లెవెల్లో భారీ హైప్ ను నమోదు చేసాడు.

మరి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పై ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా షూటింగ్ స్టార్ట్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. శంకర్ ఈ సినిమా షూట్ ని సెప్టెంబర్ నెల నుంచి స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. మరి ఈ షూట్ ని ఒక అదిరే సాంగ్ తో ప్లాన్ చేస్తున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరి ఇందులో ఎంత వరకు నిజముంది అన్నది వేచి చూడాలి. ఇక చరణ్ మరియు శంకర్ ల కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రం అయినటువంటి దీనిని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన బ్యానర్ లో 50 సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :