మెగాస్టార్ “లూసిఫర్” రీమేక్ పై లేటెస్ట్ బజ్.!

Published on May 28, 2021 5:07 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దీని తర్వాత రెండు సాలిడ్ రీమేక్ ప్రాజెక్ట్ లు కూడా లైన్ లో ఉన్నాయి. వాటిలో మళయాళ సూపర్ హిట్ చిత్రం “లూసిఫర్” రీమేక్ కూడా ఒకటి. అయితే ఈ చిత్రానికి చాలానే డ్రామా తర్వాత దర్శకుడు మోహన్ రాజా ఫైనల్ అయ్యారు.

మళ్ళీ దర్శకుని విషయంలో మార్పులు ఉంటాయని రూమర్స్ వచ్చినా అలాంటిది ఏమి లేదని కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా ఈ చిత్రంపై మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం కోసం తీసుకున్న థమన్ ఆల్రెడీ కొన్ని సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే స్క్రిప్ట్ కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోగా టైటిల్ పై ఇంకా పరిశీలనలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి మెగాస్టార్ ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ తో వస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :