పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మళ్ళీ “వకీల్ సాబ్”తో కం బ్యాక్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం లైన్ లో ఉండగానే ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా పవన్ మరిన్ని ప్రాజెక్టులను ఓకే చేసేసి ఫ్యాన్స్ కు కావాల్సినంత కిక్కిచ్చారు. అయితే మరి పవన్ చేపట్టిన ప్రాజెక్టులలో అతని అభిమానులు మాత్రం ఓ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అదే విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి తో ప్లాన్ చేసిన భారీ పీరియాడిక్ డ్రామా.
ఇది ఇంకా పాన్ ఇండియన్ సినిమాగా ప్లాన్ చేస్తున్నారో లేదో తెలీదు కానీ భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇప్పటికే కొంత మేర షూట్ ను జరుపుకున్న ఈ సినిమాపై తాజా బజ్ ఒకటి వినిపిస్తుంది. వచ్చే ఈ జనవరి మొదటి వారం నుంచే పవన్ ఈ సినిమా షూట్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ చిత్రం కోసం పవన్ కేవలం నెలన్నర రోజులు మేర డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి పవన్ ఎప్పుడు ఈ చిత్రాన్ని కంప్లీట్ చేసేస్తారో చూడాలి.


