పవన్, క్రిష్ సినిమా టైటిల్ అదేనా ?

Published on Feb 14, 2020 4:30 pm IST

పవన్ కళ్యాణ్ సైన్ చేసిన సినిమాల్లో క్రిష్ చిత్రం కూడా ఉంది. ఒకవైపు ‘పింక్’ రీమేక్ చేస్తూనే మరోవైపు క్రిష్ చిత్రాన్ని కూడా చేస్తున్నారు పవన్. ఈ చిత్రంపై ఇప్పటికే రకరకాల కథనాలు వినిపించాయి.
ఇదొక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని,
ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా సినిమా టైటిల్ ఇదేనంటూ బజ్ వినబడుతోంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పింక్’ రీమేక్ మే నెలలో విడుదలకానుండగా ఆ వెంటనే పెద్దగా గ్యాప్ లేకుండా ఈ చిత్రం కూడా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More