పవన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్.?

Published on Oct 20, 2020 12:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మళ్ళీ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వడంతో పవన్ అభిమానులను పాత రోజులు తిరిగి వాచినట్టు అయ్యింది. అయితే ఇప్పుడు పవన్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న “వకీల్ సాబ్” తో పాటుగా ఎప్పుడు లేనిది వరుస ప్రాజెక్టులకు ఓకే చెప్పేసారు. దీనితో ఒక్కోదానిపై సెపరేట్ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ అన్నిటిలో మాత్రం పవన్ అభిమానులు మరియు జెనరల్ ఆడియెన్స్ లో మంచి మోస్ట్ అవైటెడ్ చిత్రంగా నిలిచింది మాత్రం విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ప్లాన్ చేసిన చిత్రమే అని చెప్పాలి. ఈ కాంబో ఊహించనిది కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం 15 రోజుల షూట్ ను మాత్రమే పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ బజ్ ఇలా వినిపిస్తుంది.

ఈ చిత్రానికి చాలా గ్యాప్ రావదంతి క్రిష్ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఒక ప్రాజెక్ట్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. పవన్ తో చిత్రాన్ని నవంబర్ కల్లా ముగించేసి ఇక ఆ తర్వాత డిసెంబర్ లో మొదలు పెట్టాలని యోచనలో ఉన్నట్టు టాక్. ఇప్పటికే పలు ఆసక్తికర టైటిల్స్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More