పవన్ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్ ఆమేనా ?

పవన్ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్ ఆమేనా ?

Published on Jan 5, 2021 7:18 PM IST

Kiara Advani5
పవన్ కళ్యాణ్ మరోసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. పవన్, హరీష్ శంకర్ కాంబోలో గతంలో ‘గబ్బర్ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ వచ్చి ఉండటంతో వీరి రెండవ సినిమా మీద బిజినెస్ వర్గాల్లో సైతం విపరీతమైన క్రేజ్ నెలకొంది ఉంది. హరీష్ సైతం తన అభిమాన హీరోతో చేస్తున్న రెండవ చిత్రం మొదటి సినిమాను మించి ఉండాలనే ఉద్దేశ్యంతో పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు.

ఇక తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కియారా రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నటించింది. ఇలా మొదటి రెండు సినిమాలను పెద్ద హీరోలతోనే చేసిన ఆమె మూడవ సినిమాను పవన్ తో చేస్తే ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోవడం ఖాయం. ప్రస్తుతం పవన్ చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’, క్రిష్ చిత్రం పూర్తయిన తర్వాత సెట్స్ మీదకు వెళ్లనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు