ప్రభాస్ ఈ భారీ ప్రాజెక్ట్ ను కూడా ఒప్పుకున్నారా..?

Published on Jul 7, 2020 9:38 pm IST


టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ ఫ్యూర్ వింటేజ్ లవ్ డ్రామా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం కూడా పాన్ ఇండియన్ ఫిల్మ్ గానే విడుదల కానుంది. ఇక అలాగే దీని తర్వాత మరో భారీ ప్రాజెక్ట్ దర్శకుడు నాగశ్విన్ తో చేయడం కూడా కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఇవి మన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వెళ్లనున్న సినిమాలు. ఇపుడు ఇదే సమయంలో ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్ కోసం ఓ చర్చ బయటకొచ్చింది. అందులో భాగంగా అక్కడ హిస్టారిక్ హిట్ “తనాజీ” చిత్ర దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ కు ఒక స్టోరీ లైన్ వినిపించారని కూడా తెలుస్తుంది.

అయితే దీనికి సంబంధించి ఇంకా చర్చలు జరగాల్సి ఉందని అవి జరిగే సూచనలు ఇంకా ఉన్నాయి కానీ ప్రభాస్ అయితే ఇంకా ఈ ప్రాజెక్టుకు సైన్ చెయ్యలేదని తెలుస్తుంది. ఇప్పుడెలాగో రెండు సినిమాలు చేస్తున్నారు కాబట్టి వీటి తర్వాతే ఈ చిత్రం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More