“సలార్ శౌర్యంగ పర్వం” పై లేటెస్ట్ సాలిడ్ బజ్.!

“సలార్ శౌర్యంగ పర్వం” పై లేటెస్ట్ సాలిడ్ బజ్.!

Published on Apr 10, 2024 9:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్ సీజ్ ఫైర్” (Salaar Ceasefire). మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్ళని కొల్లగొట్టిన ఈ చిత్రంకి సీక్వెల్ ని కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.

“సలార్ శౌర్యంగ పర్వం” (Salaar Shouryaanga Parvam) అంటూ అనౌన్స్ చేయగా దీనిపై కూడా నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొంది. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుంది అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం మొదట్లో ఇప్పుడప్పుడే స్టార్ట్ కాదని టాక్ వచ్చింది.

కానీ తర్వాత మారిన పరిస్థితుల్లో ఈ చిత్రం వెంటనే స్టార్ట్ అయ్యి కంప్లీట్ అవుతుంది అని తెలిసింది. అయితే ఇప్పుడు మరోసారి సాలిడ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది. దీనితో సలార్ 2 దాదాపు ఈ మే లోనే షూటింగ్ మొదలు కానున్నట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా 2025 లోనే రిలీజ్ కి ఈ చిత్రం వచ్చేయవచ్చని వినిపిస్తుంది. మరి వీటిపై మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు