బజ్..”సలార్” నుంచి సాలిడ్ ట్రీట్ రాబోతోందా?

Published on Oct 5, 2021 9:00 am IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కూడా ఒకటి. శరవేగంగా పూర్తి అవుతున్న ఈ చిత్రం ఇప్పుడు స్వల్ప విరామంలో ఉంది. మరి ఈ సమయంలో “ఆదిపురుష్” ని కంప్లీట్ చేసే పనిలో పడ్డ డార్లింగ్ ఈ బర్త్ కానుకగా అదిరే ట్రీట్స్ తో రెడీ అవుతున్నాడని తెలుస్తుంది.

అయితే మాస్ లో మాత్రం మంచి అంచనాలతో ఉన్న సలార్ నుంచి సాలిడ్ ట్రీట్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం సలార్ నుంచి మాంచి మాసివ్ గ్లింప్స్ కట్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇంకా దీనిపై అధికారిక క్లారిటీ లేదు కానీ ఈ టాక్ అయితే బయటకి వచ్చింది. అసలే చాలా కాలంగా ప్రభాస్ నుంచి ఓ సరైన అప్డేట్ లేక ప్రభాస్ అభిమానులు కరువులో ఉన్నారు. పైగా మాస్ అప్డేట్ చూసి చాలా కాలమే అయ్యిపోయింది. ఈ లోటుని ప్రశాంత్ నీల్ తీరుస్తాడేమో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :