వైఎస్ అభిమానుల కోసం ‘యాత్ర’ టీజర్ ?

Published on Jul 4, 2018 9:19 am IST


దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి జీవితం ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ ‘యాత్ర’ పేరుతో ఒక బయోపిక్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాజశేఖర్ రెడ్డిగారి పాత్రను స్టార్ హీరో మమ్ముట్టి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమాపై వైఎస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. తమ అభిమాన నాయకుడ్ని ఏ విధంగా చూపిస్తారో చూడాలని ఉత్సాహపడుతున్నారు.

సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్ర టీజర్ ను రాజశేఖర్ రెడ్డిగారి జయంతి జూలై 8న విడుదలచేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఒక్క షెడ్యూల్లోనే షూటింగ్ మొత్తం ముగియనుంది. జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్, అనసూయ, సచిన్ ఖేడేకర్ వంటి నటీనటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :