వెలవెలబోతున్న ‘సినిమా థియేటర్ల’ పుట్టిల్లు !

వెలవెలబోతున్న ‘సినిమా థియేటర్ల’ పుట్టిల్లు !

Published on Feb 17, 2019 7:07 PM IST

తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే.. సినిమా థియేటర్లకు పుట్టిల్లు లాంటిది. అలాంటి థియేటర్లు ఇప్పుడు సరైనా సినిమా లేక వెలవెలబోతున్నాయి. సంక్రాంతికి వచ్చిన సినిమాల సందడి ముగిశాక ‘యాత్ర’ రూపంలో కాస్త హడావుడి కనిపించన్నప్పటికీ.. అది ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది. దాంతో కనీసం డబ్బింగ్ సినిమాలు ‘దేవ్, లవర్స్ డే’ అన్నా.. థియేటర్లలో హల్ చల్ చేస్తాయనుకుంటే.. పాపం వాటి పరిస్థితి దయనీయంగానే ఉంది.

ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఆదివారం నాడు కూడా సినిమాల కలెక్షన్స్ అన్నీ కలిపి లక్ష రూపాయిల లోపే అంటే.. ప్రస్తుత థియేటర్ల పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. అందులో ఎప్పుడో సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్ 2’ హైయ్యెస్ట్ కలెక్షన్స్ ను కలెక్ట్ చెయ్యడం విశేషం. ఒకసారి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్స్ వైజ్ గా కలెక్షన్స్ ను పరిశీలిద్దాం.

ముందుగా, సుదర్శన్ థియేటర్ లో ‘ఎఫ్ 2’ చిత్రం ఆదివారం మార్నింగ్ షో కి 17148 /- రూపాయిలను కలెక్ట్ చేసింది.

ఇక సంధ్యా థియేటర్ లో ‘దేవ్’ చిత్రం ఆదివారం మార్నింగ్ షోకు గానూ 12068 /- రూపాయిలను కలెక్ట్ చేసింది.

అలాగే దేవి థియేటర్ లో ‘లవర్స్ డే’ చిత్రం ఆదివారం మార్నింగ్ షోకు గానూ కేవలం 11376 /- రూపాయిలను కలెక్ట్ చేసింది.

అదేవిధంగా సంథ్య థియేటర్ లో ‘యాత్ర’ చిత్రం ఆదివారం మార్నింగ్ షోకు గానూ కేవలం 10408 /- రూపాయిలను మాత్రమే కలెక్ట్ చేసింది.

ఇలా మిగిలిన థియేటర్స్ అన్నిటిల్లో.. మిగిలిన సినిమాల కలెక్షన్స్ ను అన్నిటినీ కలుపుకుంటే.. సండే మార్నింగ్ షో కి సుమారు 80 వేలు మాత్రమే కలెక్ట్ చేశాయి. హాలీడే రోజూ కలెక్షన్సే ఇలా ఉంటే.. ఇక మాములు రోజు కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది. పైగా గత రెండు వారాల నుంచి థియేటర్స్ ఇలాంటి దయనీయ పరిస్థితిలోనే ఉంటూ వస్తున్నాయి.

అయినా ప్రతివారం ఏదొక చిన్న సినిమా రిలీజ్ అవుతూనే ఉంది. వాటికీ తోడూ డబ్బింగ్ సినిమాలు కూడా పోటీ పడుతున్నాయి, అయినా ఈ సినిమాలు ప్రేక్షకుల్ని మాత్రం థియేటర్లకు రప్పించలేకపోతున్నాయి. పైగా ఏదొక సినిమా చూద్దామని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను కూడా.. ఈ సినిమాలు ఆకట్టుకోకపోగా.. నిరాశ పరుస్తున్నాయి. దాంతో వీకెండ్ అవ్వగానే.. ఈ సినిమాలు అడ్రస్ లేకుండా పోతున్నాయి.

ఇక రాబోయే పెద్ద సినిమా ‘మహానాయకుడు’ ఒక్కటే. ‘మహానాయకుడు’ వచ్చాక కానీ, థియేటర్లకు కళ వచ్చేలా లేదు. అయితే బాక్సాఫీస్ వద్ద ‘కథానాయకుడు’ పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయిన విషయం తెలిసిందే. మరీ ‘మహానాయకుడు’, ‘కథానాయకుడు’లా కాకుండా.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి.. భారీ కలెక్షన్లను రాబడతాడని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు