మహేష్ లుక్ పై సర్ ప్రైజింగ్ న్యూస్

మహేష్ లుక్ పై సర్ ప్రైజింగ్ న్యూస్

Published on Apr 15, 2024 9:05 AM IST

రాజమౌళి – మహేష్ బాబు సినిమా లాంచింగ్ అప్ డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ, ఆ అప్ డేట్ మాత్రం రావడం లేదు. మరోవైపు ఈ సినిమా పై అనేక పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ పై ఓ క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తాడని.. తన కెరీర్ లోనే మహేష్ సరికొత్త గెటప్ లో కనిపిస్తాడని టాక్ నడుస్తోంది.

మొత్తానికి ఆ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుందో తెలియదు గానీ, ఈ న్యూస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎంతైనా మహేష్ రగ్గుడ్ లుక్ అంటే నిజంగా సర్ ప్రైజింగ్ ఎలిమెంటే. ప్రస్తుతం ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. కాగా ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది.

ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే, ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు