మెగాస్టార్ “ఆచార్య” టీజర్ పై లేటెస్ట్ గాసిప్స్.!

Published on Jan 19, 2021 1:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. అపారమైన అంచనాలను సెట్ చేసుకున్న ఈ చిత్రం సెట్స్ లోకి మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇటీవలే అడుగు పెట్టిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.

దీనితో మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి టీజర్ కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అందుకు తగ్గట్టుగానే దీనిపై లేటెస్ట్ గాసిప్స్ కూడా మొదలయ్యాయి. ఈ టీజర్ ను మేకర్స్ తొందరలోనే విడుదల చేస్తారని రూమర్స్ మొదలయ్యాయి.

మరి అది కూడా ఈ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తారని వినికిడి. మరి నిజంగానే ఈ టీజర్ వస్తుందా లేదా అన్నది ఎదురు చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :