మహేష్ సినిమాకు త్రివిక్రమ్ కి భారీ రెమ్యునరేషన్ తో పాటు..!

Published on May 7, 2021 5:34 pm IST

లేటెస్ట్ గా అనౌన్స్ కాబడిన మాంచి సెన్సేషనల్ కాంబోస్ లో మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుల హ్యాట్రిక్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఈ కాంబోలో సరైన హిట్స్ లేకున్నా కూడా హ్యాట్రిక్ సినిమాపై అంచనాలు మాత్రం పీక్స్ లో ఉన్నాయి. మరి వాటికి అనుగుణంగానే పలు ఆసక్తికర రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం మహేష్ కు రెమ్యునరేషన్ పైనే కాకుండా త్రివిక్రమ్ రెమ్యునరేషన్ పై కూడా సాలిడ్ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మరి వాటి ప్రకారం త్రివిక్రమ్ కు తన కెరీర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటుండమే కాకుండా షేర్స్ లో కూడా భాగస్వామ్యం కానున్నట్టు తెలుస్తుంది. దీనితో త్రివిక్రమ్ కు ఈ సినిమాతో భారీ మొత్తంలోనే ముట్టనుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే హారికా హాసిని వారు నిర్మాణం వహించనున్నారు.

సంబంధిత సమాచారం :