ఓటిటిలో “గుంటూరు కారం” అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.!

ఓటిటిలో “గుంటూరు కారం” అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.!

Published on Feb 4, 2024 10:19 AM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా మీనాక్షి చౌదరి మరో పాత్రలో దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం” మరి మళ్ళీ మహేష్ లో కంప్లీట్ మాస్ యాంగిల్ సహా త్రివిక్రమ్ మార్క్ ఎమోషన్స్ తో మహేష్ బాబు ఆడియెన్స్ ని మెప్పించాడు. మరి ఈ చిత్రం థియేటర్స్ లో భారీ వసూళ్లు రీజనల్ గా అందుకోగా ఇప్పుడు ఈ చిత్రం అఫీషియల్ ఓటిటి రిలీజ్ వచ్చేసింది.

మరి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇందులో ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ వారు అఫీషియల్ అప్డేట్ అందించారు. అలాగే ఒరిజినల్ తెలుగు సహా తమిళ్, మళయాళం, కన్నడ అలాగే హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. మొత్తానికి అయితే ఓటిటిలో రమణ గాడి ర్యాంపేజ్ కి డేట్ ఫిక్స్ అయ్యిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు