లేటెస్ట్ : తారకరత్న ఆరోగ్యం పై అప్ డేట్ అందించిన నందమూరి రామకృష్ణ

Published on Jan 30, 2023 5:52 pm IST

నందమూరి తారకరత్న ఇటీవల కుప్పం నుండి నారా లోకేష్ ప్రారంభించిన యువ గళం పాదయాత్రలో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు గడించిన తారకరత్న టిడిపి పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇక అతి త్వరలో టిడిపి తరపున మరింతగా పనిచేయాలని భావించిన తారకరత్నకి ఒక్కసారిగా ఇలా జరగడంతో నందమూరి కుటుంబసభ్యులతో పాటు టిడిపి శ్రేణులు కూడా దిగ్బ్రాంతి చెందుతున్నాయి. అయితే ఆయనకి కుప్పంలో కొంత చికిత్స అందించిన అనంతరం బెంగళూరు లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

ఇక ఆయనని నందమూరి బాలకృష్ణ దగ్గరుండి మరీ బెంగళూరు తరలించి ప్రస్తుతం పలువురు నిపుణులైన డాక్టర్ల నేతృత్వంలో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అయితే నిన్నటి వరకు ఒకింత విషమంగానే ఉన్న తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం ఒకింత మెల్లగా కుదుటపడుతోందని కొద్దిసేపటి క్రితం ఆయనని పరామర్శించిన బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ తెలిపారు. ఆయనకు ఎక్మొ పెట్టలేదని, అలానే ఆయన అవయువలన్నీ కూడా చికిత్సకు స్పందించడంతో పాటు కొంతవరకు ఆయన సొంతంగానే ఆక్సిజన్ తీసుకుంటున్నారని అన్నారు. అయితే సిటీ స్కాన్ రిపోర్ట్ వచ్చిన తరువాత బ్రెయిన్ పనితీరుపై క్లారిటీ వస్తుందని, మొత్తంగా మెల్లగా ఆయన కోలుకుంటుంటారనే గట్టి నమ్మకం ఉందని అన్నారు. కాగా ఈ న్యూస్ కొద్దిసేపటి క్రితం వెల్లడించడంతో అందరూ ఒకింత ఆనందం వ్యక్తం చేస్తూ త్వరలోనే తారకరత్న మన అందరి ముందుకు తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత సమాచారం :