లేటెస్ట్ : హృతిక్ రోషన్ ‘ఫైటర్’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

లేటెస్ట్ : హృతిక్ రోషన్ ‘ఫైటర్’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Mar 20, 2024 8:40 PM IST

బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా సిద్దార్ధ ఆనంద్ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన మూవీ ఫైటర్. భారీ వ్యయంతో రూపొందిన ఈ ఏరియల్ యాక్షన్ మూవీలో అనిల్ కపూర్ కీలక పాత్ర చేసారు. ఇతర పాత్రల్లో కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, అశుతోష్ రానా, సంజీవ్ జైస్వాల్ తదితరులు నటించారు.

ఇక ఇటీవల థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్న ఫైటర్ మూవీ నేడు అర్ధరాత్రి 12 గం. ల నుండి ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ కి అందుబాటులోకి రానుంది. ఈ విషయమై కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. ఫైటర్ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించగా విశాల్ శేఖర్ సాంగ్స్ కంపోజ్ చేసారు. మరి ఫైటర్ మూవీ ఎంతమేర ఓటిటి ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు