“బాలయ్య 107” పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.!

Published on May 13, 2022 6:26 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లాస్ట్ సినిమా “అఖండ” భారీ హిట్ తర్వాత మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో తన కెరీర్ లో 107వ సినిమాని టేకప్ చేసిన సంగతి తెలిసిందే. మరి దీనిని కూడా భారీ అంతే మాసివ్ గా సాలిడ్ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై లేటెస్ట్ కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకి వచ్చాయి.

ప్రస్తుతానికి ఈ చిత్రం షూటింగ్ 40 శాతం మేర కంప్లీట్ అయ్యిపోయిందట. అలాగే కొత్త షెడ్యూల్ ఈ సినిమాలోని ఒక సూపర్ సాంగ్ తో ఈ మే 16 నుంచి స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :