కొందరి కామెంట్స్ కి తారక్ నుంచి గట్టి సమాధానం.!

Published on Aug 4, 2022 1:00 pm IST


గత కొన్ని రోజులు కితమే నందమూరి కుటుంబంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. స్వర్గీయ నందమూరి తారక రామారావు కూతురు ఉమా మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడిన ఘటనతో నందమూరి సహా నారా కుటుంబంలో విషాదం చేసుకుంది. దీనితో సినీ ప్రముఖులు సహా రాజకీయ ప్రముఖులు కూడా తమ విచారం వ్యక్తం చేశారు.

అలాగే ఉమా మహేశ్వరి సోదరుడు ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ ఆమె అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు. కానీ ఇలాంటి దురదృష్ట ఘటనలు చోటు చేసుకున్న సమయంలో అయితే పలువురి కామెంట్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మరి అలాంటి వారికి ఎన్టీఆర్ ఇప్పుడు సమాధానం ఇవ్వబోతున్నాడని కన్ఫర్మ్ అయ్యింది.

ఈ రోజు సాయంత్రం తారక్ ఉమా మహేశ్వరి కుటుంబీకులను కలవడానికి వారి ఇంటికి వెళ్తున్నాడని ఇప్పుడు వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో అలా తాను వెళ్ళడానికి సిద్ధం అయినట్టుగా తెలుస్తుంది. మరి దీనితో అయితే ఎందుకు తారక్ ఆ సంఘటనపై స్పందించలేదు అనే వాసరికి గట్టి సమాధానం ఇచ్చినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :