బాలయ్య యాక్షన్ కోసం భారీ సెట్ ?

బాలయ్య యాక్షన్ కోసం భారీ సెట్ ?

Published on Dec 4, 2023 4:00 PM IST

balakrishna

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ ఉందట. ఇప్పుడు ఈ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో బాలయ్య యాక్షన్ విజువల్స్ చాలా వైల్డ్ గా ఉంటాయని తెలుస్తోంది. వచ్చే షెడ్యూల్ లో ఈ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయాలని బాబీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య గెటప్ కూడా హైలైట్ గా ఉంటుందట. అలాగే సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట.

అన్నట్టు ఈ సినిమా బాలయ్య టైపు ఫక్తు యాక్షన్ డ్రామా కాదు అని.. ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా ఈ సినిమాలో పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఏది ఏమైనా ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్‌‌ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాలో దర్శకుడు బాబీ, బాలయ్య ఫ్యాన్స్ కోసం ఎలాంటి క్రేజీ ఎలిమెంట్స్ రాశాడో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు