‘ఎన్టీఆర్’ కి విలన్స్ గా ఆ ఇద్దరు ?

‘ఎన్టీఆర్’ కి విలన్స్ గా ఆ ఇద్దరు ?

Published on Jun 16, 2024 8:45 PM IST

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఈ ఏడాది ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఐతే, తాజాగా ఈ సినిమా పై ఓ కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్, విలన్స్ గా నటించబోతున్నారు. వారిలో ఒకరు యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ కాగా, మరొకరు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా ఎన్టీఆర్ కి విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని శక్తిమంతమైన విలన్ పాత్ర కోసం టైగర్ ష్రాఫ్ ను ప్రశాంత్ నీల్ కలిసినట్లు టాక్. ఐతే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అన్నట్టు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోందని తెలుస్తోంది. మరి, కియారా అద్వానీ, నిజంగానే ఎన్టీఆర్ సరసన నటిస్తే.. ఆ క్రేజే వేరు. అలాగే, ఈ సినిమాలో మరో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉందని.. ఆ పాత్రలో మరో స్టార్ హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు