భార్యభర్తల్లా సామ్ – చై చాలా సహజంగా నటించారట !

Published on Mar 16, 2019 4:00 am IST

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగ చైతన్య హీరోహీరోయిన్లుగా రాబోతున్న చిత్రం మజిలీ. కాగా ఫెయిల్ అయిన ఒక క్రికెటర్ జీవితంలోకి.. భర్తే ప్రాణం అని నమ్మే ఒక అమ్మాయి భార్యగా వస్తే.. ఆ తరువాత అతని లైఫ్ ఎలా మారుతుంది, తిరిగి అతను జీవితంలో ఎలా ఎదిగాడు అనే పాయింట్ బేస్ చేసుకుని శివ నిర్వాణ ఈ సినిమా తెరకెక్కిస్తోన్నాడు.

అయితే చైతు – సమంతల మధ్య వచ్చే సన్నివేశాలు మరియు వారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వచ్చిందట. ముఖ్యంగా భార్యభర్తల్లా సామ్ – చై చాలా సహజంగా నటించారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చైతు రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. యంగ్ గెటప్ లో ఒకలా.. సమంతతో పెళ్లి తరువాత గెడ్డంతో మరో గెటప్ లో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా నటి దివ్యంశ కౌశిక్ ముఖ్య పాత్రలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More