మరో అతిథి పాత్రలో తృప్తి డిమ్రి ?

మరో అతిథి పాత్రలో తృప్తి డిమ్రి ?

Published on Mar 19, 2024 12:00 AM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సినిమా పుష్ప 2: ది రూల్. ఇప్పటికే, ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో రూమర్లు వినిపించాయి. తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది ‘తృప్తి డిమ్రి’.

మొత్తానికి తృప్తి డిమ్రి ఓవర్‌ నైట్ లోనే స్టార్‌గా మారింది. ఐతే, తృప్తి డిమ్రి ఇప్పుడు పుష్ప 2లో ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప రాజ్ అనుచరుడిని ట్రాప్ చేయించి చంపించే పాత్రలో తృప్తి డిమ్రి కనిపిస్తోందట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఆగస్టు 15న, 2024లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు