“గేమ్ చేంజర్”లో మలయాళ హీరో ?

“గేమ్ చేంజర్”లో మలయాళ హీరో ?

Published on Mar 17, 2024 9:45 PM IST

దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా “గేమ్ చేంజర్” సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మోహన్ లాల్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారని.. పాత్ర నిడివి తక్కవే అయినప్పటికీ, గేమ్ చేంజర్ లో చాలా కీలకమైన పాత్ర అని టాక్ నడుస్తోంది.

కాకపోతే, మోహన్ లాల్ పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అంజలి, ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు