ఖుషీతో విజయ్ దేవరకొండ – సమంత…వైరల్ అవుతోన్న ఫోటో!

Published on Jun 14, 2022 8:00 pm IST

విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఖుషీ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మరియు ఈ రోజు అతను సినిమా సెట్స్ నుండి ఒక చిత్రాన్ని పోస్ట్ చేయడం జరిగింది.

ఈ చిత్రంలో విజయ్ మరియు సామ్‌తో పాటు శివ మరియు అతని కుటుంబ సభ్యులు ఉన్నారు. చిత్రంలో శివ నిర్వాణ కూతురు కూడా చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. రొమాంటిక్ ఎంటర్ గా తెరకెక్కుతున్న ఖుషి చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :