లేటెస్ట్.. తెలుగులో “ప్రేమలు” ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది

లేటెస్ట్.. తెలుగులో “ప్రేమలు” ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది

Published on Apr 7, 2024 10:00 AM IST

ఇటీవల మళయాళ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో యువ నటీనటులు నెల్సన్, మమిత బైజు (Mamita Baiju), సంగీత్ ప్రదీప్ లు నటించిన “ప్రేమలు” (Premalu Telugu) కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు గిరీష్ తెరకెక్కించగా మళయాళంతో పాటుగా ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అయ్యి సాలిడ్ హిట్ అయ్యింది.

భారీ వసూళ్లు అందుకొని ఈ చిత్రం థియేట్రికల్ రన్ ని ఎట్టకేలకి కంప్లీట్ చేసుకోగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రీసెంట్ గానే మళయాళ వెర్షన్ డేట్ ని స్ట్రీమింగ్ యాప్ హాట్ స్టార్ వారు రివీల్ చేయగా ఇప్పుడు మన తెలుగు డేట్ వచ్చేసింది. తెలుగు హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా ఎవరు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ ఏప్రిల్ 12 న రిలీజ్ కాబోతున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు. దీనితో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోజులు రిమైండర్ పెట్టుకుంటే సరిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు