మహేష్ కి తండ్రిగా అమితాబ్ బచ్చన్ ?

మహేష్ కి తండ్రిగా అమితాబ్ బచ్చన్ ?

Published on Dec 12, 2022 11:42 PM IST

రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఈ సినిమా గురించి ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త రూమర్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకి తండ్రిగా అమితాబ్ బచ్చన్ నటించబోతునట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అలాగే మహేష్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె నటించబోతుందని టాక్ నడుస్తోంది.

ఆ మధ్య మహేష్ కి విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నాడని వార్తలు రాశారు. నిజానికి ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. కాకపోతే.. ఈ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్‌ రాసిన కథలో తండ్రి పాత్ర చాలా కీలకం అని.. అందుకే ఆ పాత్రలో అమితాబ్ నటిస్తే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక విజయేంద్రప్రసాద్‌, మహేశ్‌ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రాశారట. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు